Advertisement
Google Ads BL

ఆ దర్శకుడి రెండు చిత్రాలు ఒకేరోజు..!


సాధారణంగా ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదలైతే అదేే పెద్ద సంచలనం. అలాంటిది ఒకే దర్శకుడు డైరెక్ట్‌ తీసిన రెండు డబ్బింగ్‌ చిత్రాలు ఒకేరోజు విడుదల కావడం బహుఅరుదు. ఆ ఘనతను సొంతం చేసుకుంటున్నాడు తమిళ డైరెక్టర్‌ పాండిరాజ్‌. ఆయన డైరెక్ట్‌ చేసి, గత రెండు నెలలుగా విడుదల వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రాలు రెండు తెలుగులో వచ్చే శుక్రవారం అంటే మార్చి18న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవే 'కథకళి, మేము' చిత్రాలు. ఈ చిత్రాల విడుదల ఇప్పటివరకు చాలాసార్లు విడుదల వాయిదాపడుతూ వస్తున్నాయి. విశాల్‌ హీరోగా, కేథరిన్‌ హీరోయిన్‌గా తమిళంలో పొంగల్‌కు విడుదలైన 'కథకళి' చిత్రంతో పాటు సూర్య, అమలాపాల్‌లు జంటగా రూపొందిన 'మేము' చిత్రం కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రాలు తమిళంలో 'కథకళి, పసంగ2' పేర్లతో విడుదలయ్యాయి. మరి ఈ రెండు చిత్రాలలో ఏ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs