దర్శకుడు పూరీజగన్నాథ్ స్టైలే వేరు. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండడు. అలాగే చిన్నపెద్ద తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం ఆయన నైజం. అంతేకాదు ఆయనకు బాషా భేదాలు కూడా లేవు. అదే ఇప్పుడు వర్కౌట్ అవుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయనకు బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఖరారు చేశాడు. పూరీ మాట్లాడుతూ.. అవును... నేను సంజయ్‌దత్‌తో ఓ హిందీ చిత్రం చేయబోతున్నాను. 'రోగ్' చిత్రం అనంతరం ఈ సినిమా ఉంటుంది. సంజయ్‌దత్‌కు నా స్క్రిప్ట్ వినిపించాను. ఆయన చాలా ఇష్టపడ్డారు.. అని తెలిపాడు. ప్రస్తుతం పూరీ 'రోగ్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈమధ్య పూరీతో గొడవపడి దూరమైన చార్మి తాజాగా మరలా పూరీ కాంపౌండ్‌లోకి వచ్చి ఈ 'రోగ్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగుభాషల్లో నిర్మిస్తున్నాడు. గతంలో కూడా ఆయన బాలీవుడ్‌లో అమితాబ్‌బచ్చన్‌తో, కన్నడలో పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అప్పు' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వరుణ్‌తేజ్‌తో 'లోఫర్' తర్వాత ఈ 'రోగ్' పనిలో పడ్డాడు. ఈ చిత్రం తర్వాత సంజయ్‌దత్ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం.