Advertisement
Google Ads BL

నాని ని లైన్ లో పెడుతున్నారు!


'గబ్బర్‌సింగ్‌'తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన దర్శకుడు హరీష్‌శంకర్‌. కానీ తర్వాత ఆయన చేసిన 'రామయ్యావస్తావయ్యా' చిత్రంతో డిజాస్టర్‌ అందుకోవడంతో ఇప్పుడు ఎవ్వరూ హరీష్‌శంకర్‌ను కోరుకోవడం లేదు. ఆయనతో ఓ సినిమా చేస్తానని బన్నీ మాటిచ్చినా ఆ తర్వాత హ్యాండిచ్చాడు. ఇక ఆయన సాయిధరమ్‌తేజ్‌తో చేసిన 'సుబ్రమణ్యం ఫర్‌సేల్‌' చిత్రం ఫర్వాలేదనిపించినప్పటికీ.. దర్శకునిగా అవకాశాలను తీసుకొని రాలేకపోయింది. తాజాగా హరీష్‌శంకర్‌.. నాని హీరోగా ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. నిర్మాత బండ్ల గణేష్‌ మలయాళంలో మంచి హిట్టు అయిన 'టూ కంట్రీస్‌' రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విక్టరీ వెంకటేష్‌తో ఈ చిత్రం చేయాలని భావించినప్పటికీ వెంకీ వైపు నుండి పెద్దగా స్పందన రావడం లేదట. దాంతో ఈ చిత్రం రీమేక్‌ దర్శకునిగా తనకు 'గబ్బర్‌సింగ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్టును అందించి, రీమేక్‌ చిత్రాలను తనదైన శైలిలో తీయగలనని నిరూపించుకున్న హరీష్‌శంకర్‌కు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడని, ఈ చిత్రాన్ని నానితో చేస్తే బాగుంటుందనే ఉద్ధేశ్యంలో బండ్ల గణేష్‌, హరీష్‌శంకర్‌లు ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs