పోయిన వారం విడుదలయిన అన్ని చిత్రాల్లోకి కళ్యాణ వైభోగమేకి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వైభోగం ఉండబోతోందని వ్యాపార వర్గాలు విశ్లేషించాయి. అలాగే క్రిటిక్స్ కూడా అంతుపట్టని స్థాయిలో మూకుమ్మడిగా మూడు ఆ పైనే రేటింగ్స్ వేసేసి నందిని రెడ్డి, దామోదర ప్రసాద్, నాగ శౌర్య, మాళవిక నాయర్లని మైమరిపింపజేశారు. సినిమా నిజంగానే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో బాక్సాఫీస్ టేకాఫ్ ఎలాగున్నా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన కొద్దీ వసూళ్లు పుంజుకుంటాయి అనుకున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం శౌర్య, గుంటూరు టాకీస్ వంటి అపోజిషన్ రిలీజెస్ కన్నా కళ్యాణానికి జనాదరణ పెరిగినా, అనుకున్నంత అద్భుతమో లేదా అమోఘమో మాత్రం కాదంటున్నారు. ఆక్యుపెన్సీ రేషియో నగరాల్లో ఎక్కువగా ఉండడం శుభసూచకమే, అదే లోయర్ సెంటర్స్ విషయానికి వస్తే నాగ శౌర్యకు సరైన ఇమేజి లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇబ్బడిముబ్బడిగా ప్రేక్షకులు వచ్చేస్తారనుకున్న చాలా చోట్ల వసూళ్లు మందకొడిగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆఖరుగా, కళ్యాణ వైభోగమేని హిట్టు కింద వేయాలా లేక అబోవ్ యావరేజ్ కింద వేయాలో అర్థం కాని పరిస్థితి. కనీసం నిర్మాతలైనా అఫీషియల్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ పంపితే మనమూ ఏదో ఒకటి డిసైడ్ అవొచ్చు!