జనరలుగా అయితే మహేష్ బాబు కథ, కథనం పూర్తిగా నచ్చితే తప్ప ఏ దర్శకుడికీ, నిర్మాతకీ కాల్షీట్లు ఇష్యూ చేయడు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో కాస్తంత కన్సిడరేషన్ ఇచ్చినా సినిమా ఖచ్చితంగా బాగానే వస్తోందా లేదా అన్న క్రాస్ చెకింగ్ అయితే చేసుకుంటూనే ఉంటాడు. అలా చెకింగ్ చేస్తూ బయటపడిన కొన్ని వీక్ పాయింట్స్ విషయం మీదే బ్రహ్మోత్సవం పట్ల మహేష్ బాబుకు చింత ఎక్కువైంది అని టాక్. నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం వహిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి స్ట్రాంగ్ తెలుగు చిత్రం మహేష్ బాబుకు అందించిన శ్రీకాంత్ మరోసారి అలాంటి అచ్చతెలుగు చిత్రాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటున్నా అక్కడ జరిగేది వేరేలా ఉంది. రిలీజ్ ప్లాన్ ఎలాగో మే నెలకి వాయిదా పడడానికి ముఖ్య కారణంగా చెప్పుకుంటున్నది కథలో లోపాలే. సీతమ్మ లాగానే కథను పూర్తిగా పలుచన చేసాడట శ్రీకాంత్. దీనికి తోడు స్క్రిప్టులో ఎప్పుడు పడితే అప్పుడు చేసిన కరెక్షన్స్ జతవడంతో మొత్తం నరేషన్ అతుకుల బొంతలా ఉందని మహేష్ భయపడి పోతున్నాడట. ఇందులో భాగంగా రీ-రైటింగ్, రీ-షూటింగ్ పరిపాటి అయిపొయింది. తనకున్న నెట్ వర్క్ వాడుకొని PVP, మహేష్ మొదటగా రాఘవేంద్ర రావు గారిని సంప్రదించడమూ, మళ్ళీ మొన్న పరుచూరి బ్రదర్స్ గారిని ఆఫీసుకు పిలిపించి లోపాలని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు బయటికొస్తున్నాయి.