సినిమా నిర్మాణం అనేది జూదంతో సమానంగా మారిపోయింది. స్టార్‌హీరో, స్టార్‌డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్ల సినిమాల పరిస్థితే ఇలా ఇబ్బందికరంగా ఉంటే ఇక కొత్తగా సినిమాలు చేయాలని ఎలాంటి అనుభవం, అవగాహన లేని నిర్మాతలు ఫీల్డ్‌కి వస్తే వారి పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. విషయానికి వస్తే... అప్పట్లో 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' సమయంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా చేరన్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై పూర్తి అయినా కూడా రిలీజ్‌కు నోచుకోని సంగతి గుర్తుండే ఉంటుంది. 'ఏమిటో ఈ మాయ' అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం స్రవంతి రవికిషోర్ వంటి పెద్ద నిర్మాత వెనక ఉండి కూడా రిలీజ్ కాక అలా మిగిలిపోయింది. కానీ దాన్ని ఇప్పుడు బయటకు తీసి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో ఇప్పటికే ఈ చిత్రం విడుదలైంది. కాగా మొదట్లో అనుకున్న 'ఏమిటో ఈ మాయ' అనే టైటిల్‌ను మార్చి 'రాజాధిరాజా' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయిన స్రవంతి రవికిషోర్ ఈ చిత్రం రైట్స్‌ను ఎన్.వెంకటేష్ అనే నిర్మాతకు అమ్మివేశాడు. ఆయన తన బృందావన్ పిక్చర్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు.