Advertisement
Google Ads BL

'ఆండ్రాయిడు' వచ్చేస్తున్నాడు!


అతి తక్కువ టైమ్‌లోనే ఓ వెరైటీ స్టార్‌డమ్‌ని తెచ్చుకున్న టాలీవుడ్‌ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సంపూర్ణేష్‌బాబే. అతను నటించిన 'హృదయ కాలేయం' అంతలా సంపూని పాపులర్‌ చేసింది. ఆ తర్వాత సంపూ టాలీవుడ్‌లో జరిగే ప్రతి ఈవెంట్‌లో దర్శనమిస్తు...తన డైలాగ్‌లతో అందరికీ నవ్వు తెప్పిస్తూనే ఉన్నాడు. తాజాగా 'హృదయ కాలేయం' టీమ్‌తో సంపూ చేస్తున్న'కొబ్బరిమట్ట' చిత్రం వద్దన్నా కూడా సంపూని వార్తల్లో ఉండేలా చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కోలుక్‌ విడుదల అవుతుంటే.. ఈ సినిమాతో సంపూ పూర్తి స్టార్‌ హీరోగా మారిపోవడం ఖాయంగా అనిపిస్తుంది. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అంటూ మూడు పాత్రలో దర్శనమివ్వబోతున్న సంపూ అతి త్వరలో 'ఆండ్రాయిడు'గా దర్శనమివ్వబోతున్నాడు. ఆ లుక్‌కి సంబంధించిన హింట్‌ని ఇచ్చే లుక్‌ ఇది. దీంతో ఇంకెంత సంచలనం సృష్టిస్తాడో..చూద్దాం. స్టీవెన్‌ శంకర్‌ కథ అందించిన ఈ చిత్రానికి రూపక్‌ రోనాల్డ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్‌ అండ్‌ సంజన మూవీస్‌ బ్యానర్‌లలో ఆది కుంభగిరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs