విభిన్న కథా చిత్రాలను, సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాలను తీయడంలో దర్శకుడు క్రిష్‌ది విభిన్నమైన శైలి. తాజాగా ఆయన జేమ్స్‌బాండ్ తరహా థ్రిల్లర్‌తో వరుణ్‌తేజ్‌తో 'రాయబారి' అనే చిత్రం చేద్దామని భావించాడు. కానీ ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. తాజాగా ఆయన హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్ట్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తన గత చిత్రాలకు భిన్నంగా పూర్తిస్థాయి వినోదం, యాక్షన్ కలగలిపిన చిత్రంగా ఆయన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. హిందీలో ఈ చిత్రంలో అక్షయ్‌కమార్ హీరోగా నటిస్తుండగా, తమిళంలో హీరోను ఇంకా ఫైనలైజ్ చేయాల్సివుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'ట్రినిటీ పిక్చర్స్'తో పాటు ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించనుంది. కాగా గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్' చిత్రంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.