'ఇష్క్,మనం' చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా రూపొందుతున్న చిత్రం '24'. ఇందులో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు ఆయనకు జోడీగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్య తన సొంతబేనర్ అయిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండగా, తెలుగు వెర్షన్ హక్కులను హీరో నితిన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదో సైన్స్ ఫిక్షన్ కథగా రూపొందుతోంది. ఫస్ట్‌లుక్‌లో సూర్య పాత్ర గురించి మూడు విభిన్న షేడ్స్‌తో రిలీజ్ చేసిన మూడు పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళ నూతన సంవత్సరమైన ఏప్రిల్ 14న విడుదల చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్16న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. మార్చి నెలలో ఈ చిత్రం ఆడియోను భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 4వ తేదీన అంటే శుక్రవారం విడుదల చేయనున్నారు.