ఇంతకు ముందు పవన్‌కళ్యాణ్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'కెమెరామెన్‌గంగతో రాంబాబు' చిత్రానికి పవర్‌ఫుల్ జర్నలిస్ట్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నాడు పూరీ. అందులో పలు సామాజిక అంశాలపై స్పందించే పాత్రను పవన్ చేత చేయించాడు. కాగా మరలా కాస్త అటు ఇటుగా పూరీ మరోసారి జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లోనే మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో పూరీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కళ్యాణ్‌రామ్ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌లో నిర్మించనున్నాడు. 'పటాస్' చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించిన కళ్యాణ్‌రామ్ మరి పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను ఎలా చేసి మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది.