కొందరు దర్శకులు ఎన్ని సినిమాలు చేసినా తమదైన శైలిలో, తమకు అచ్చివచ్చిన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూనే ఉంటారు. అదే కోవలోకి కొరటాల శివ కూడా వస్తాడు. ఆయన దర్శకత్వంలో ఇప్పటికి 'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలలోనూ కొరటాల హీరోలైన ప్రభాస్, మహేష్‌బాబుల చేత బుక్స్ పట్టించాడు. తాజాగా ఎన్టీఆర్‌తో చేస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో కూడా ఆయన అదే రూట్ ఫాలో అవ్వనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. ఇక తన సినిమాలకు కేవలం హీరోలనే నమ్ముకోకుండా ఓ కీలకపాత్రను సృష్టించి దానికి మంచి ఇమేజ్ ఉన్న నటులను తీసుకొని మంచి ప్యాడింగ్ చేసుకోవడం కూడా కొరటాల శివ సెంటిమెంట్‌గానే భావించవచ్చు. 'మిర్చి'లో సత్యరాజ్, నదియాలను అలాగే వాడుకొన్నాడు. 'శ్రీమంతుడు' చిత్రంలో కూడా జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌లను తీసుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌తో చేస్తున్న 'జనతా గ్యారేజ్'లో కూడా కీలకపాత్రకు మోహన్‌లాల్‌నీ తీసుకున్నాడు. ఇలా తనకు అచ్చివచ్చిన సెంటిమెంట్స్‌ను కొరటాల శివ ఫాలో అవుతుండటం విశేషం.