ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని విడుదల చేయడం అంతకన్నా కష్టమని ఏ తెలుగు సినిమా నిర్మాతను అడిగిన చెబుతాడు. అలాంటిది ఓ సూపర్ స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం అంటే అది ఎంత గొప్ప విషయమో తెలుసా ! కాని ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకుంది దర్శకురాలు చునియా. సరే ఆమె విషయం పక్కన పెడితే ఈ సినిమా విషయం లో విడుదలకు ముందు నాగార్జున చెప్పిన విషయాలు మాత్రం సినిమాలో ఎక్కడా కనపడలేదు. అసలు ఈ సినిమాలో ఏం నచ్చి నాగ్ సర్ ప్రమోషన్ చేసాడనే విషయం ఇప్పటికి అర్థం కావడం లేదు? కథలో కొత్తదనం ఏదైనా ఉందా అంటే అది లేదు? చదువు అటక ఎక్కించి తండ్రితో తిట్లు తినే హీరో, వేరే వ్యక్తిని ఇష్టపడ్డ హీరోయిన్ ని లవ్ చేయాలనుకునే హీరో, హీరో వద్దంటున్న లవ్ అంటూ హంగామా చేసే హీరోయిన్. ఇలాంటి సినిమాలు ఇప్పటికే కోకొల్లలుగా వచ్చాయి? మరి నాగార్జున కు ఇందులో ఏం నచ్చిందో ఆయనకే తెలియాలి !