టాలీవుడ్ లో ఉన్న ఏ సినిమా ప్రేక్షకుడికైనా తెలిసిన విషయం ఒక్కటే ? అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి కి మోహన్ బాబు కు మద్య ఇగో ప్రోబ్లమ్స్ ఉన్న విషయం. వీరిద్దరూ కలిసినప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ ని చిరంజీవి కంటే ముందే మొదలు పెట్టిన మోహన్ బాబు కు చిరంజీవి అంటే కాస్త జలస్ గా ఉన్న విషయం ఎప్పుడు ఏ కార్యక్రమం లో కలిసిన మోహన్ బాబు మాటల్లో తేలిపోతుంది. గత కొన్ని ఏళ్ళుగా జరిగిన ఈ వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది ! ఇటివలే జరిగిన ఖామోష్ అనే పుస్తకావిష్కరణ సభలో మోహన్ బాబు ఇంకా చిరంజీవిని టీజ్ చేయడం మాత్రం మానలేదు! మోహన్ బాబు కూడా మంచి నటుడు , స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కూడా కాని వేరే హీరో సూపర్ స్టార్ ఇమేజ్ తో ఉన్నాడని ఇగో పెంచుకుని ఇంకా టీజ్ చేయడం మాత్రం ఎంతవరకు కరక్టో మరి ఆయనకే తెలియాలి !!