బాలీవుడ్ ‘మర్డర్’ చిత్రంలో మల్లికాశరావత్‌ను తలపించేలా రష్మీ ‘గుంటూరు టాకీస్’లో హాట్ హాట్‌గా దర్శనమివ్వబోతుంది. ఈ చిత్రంలో రష్మీ హాట్ సాంగ్ ప్రొమో చూడగానే కుర్రకారు రష్మీ అందాలకు ఫిదా అయిపోయారట. అంతేకాదు జబర్ధస్త్ షోలో చిట్టిపొట్టి డ్రెస్‌లతో ఆకట్టుకునే రష్మీలో ఇంతటి రొమాంటిక్ యాంగిల్ వుందా అని ఆశ్చర్యపోతున్నారట. కొంత మంది మాత్రం రష్మీ.. దిస్ ఈజ్ టూమచ్ అంటున్నారట. అయితే గుంటూరు టాకీస్ చిత్రానికి మంచి ప్రారంభ వసూళ్లు రావడానికి కూడా రష్మీ పాట హెల్ప్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందాల ప్రదర్శనలో ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ హాట్‌భామను ఆ పాటలో చూసిన దర్శక నిర్మాతలు రష్మీకి అవకాశాలు ఇవ్వడానికి.. తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కానీ ఈ అమ్మడు మాత్రం ‘గుంటూరు టాకీస్’ విడుదల తర్వాత పారితోషికాన్ని పెంచి తదుపరి చిత్రాలను అంగీకరించాలనే ఆలోచనలో వుందట..!