Advertisement
Google Ads BL

మెగాహీరోలను బుట్టలో వేసుకుంది..!


టాలీవుడ్‌లో తాజా స్టార్‌హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌పింగ్‌ మెగాహీరోలను వదలడం లేదు. మరి ఏ మాయ చేసిందో గానీ 'బ్రూస్‌లీ' చిత్రం డిజాస్టర్‌ అయినప్పటికీ రామచరణ్‌ పట్టుబట్టి తన తాజా చిత్రం 'తని ఒరువన్‌'లో మరోసారి ఆమెతో రొమాన్స్‌ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక ఆల్‌రెడీ ఆమె 'బ్రూస్‌లీ' చిత్రంలో ఓ సీన్‌లో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించింది. ఇక ఆమె ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా గీతాఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న 'సరైనోడు'లో బన్నీతో రొమాన్స్‌ చేస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రంలో సాయి సరసన హీరోయిన్‌గా రకుల్‌నే ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మిస్తుండగా ఏప్రిల్‌ నుండి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఆమెను తన తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలని మరో మెగాహీరో వరుణ్‌తేజ్‌ కూడా డిసైడ్‌ అయ్యాడు. ఇక మెగాహీరోలలో మిగిలింది పవన్‌కళ్యాణ్‌ మాత్రమే. ఆయనతో కూడా నటించే చాన్స్‌ వస్తే రకుల్‌ మెగాహీరోలందరినీ ఓ రౌండ్‌ వేసిన హీరోయిన్‌గా నిలిచిపోతుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs