సాధారణంగా ఒక హీరో, మరో హీరోయిన్ కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించి హిట్స్ కొడితే వారిది సూపర్‌హిట్ కాంబినేషన్ అంటారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్న చిత్రాలు వరుసగా రూపొందుతున్నాయి.. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు.. సమంత, నిత్యామీనన్. వీరిద్దరూ 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో కలిసి నటించారు. తాజాగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '24' చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో కూడా మరోసారి ఎన్టీఆర్‌కు జోడీగా సమంత, నిత్యామీనన్‌లు కలిసి నటిస్తున్నారు. ఇది ఎన్టీఆర్‌తో సమంత కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం కాగా, నిత్యామీనన్ తొలిసారి ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. సమంత కేవలం నిత్యామీనన్‌తోనే కాదు... ఇతర హీరోయిన్లతో కూడా వరుసగా చిత్రాలు కలిసి చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కాజల్, సమంతలు కలిసి ఎన్టీఆర్ 'బృందావనం'లో నటించారు. తాజాగా మహేష్ హీరోగా రూపొందుతున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో కూడా కలిసి నటిస్తున్నారు. ఇక సమంత ప్రణీతతో కలిసి 'అత్తారింంటికి దారేది' చిత్రంలో కలిసి నటించారు. ఆ వెంటనే వారు మరలా ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో కలిసి నటించారు. తమిళంలో సమంత, అమీజాక్సన్‌తో కలిసి రెండు చిత్రాల్లో నటిస్తోంది. మొత్తానికి హీరోలనే కాదు.. తోటి హీరోయిన్లను కూడా మాయ చేయడంలో సమంతను మించిన వారు లేరు అనే చెప్పాలి.