సంగీత దర్శకుడు తమన్ అంటే కాపీలకు ప్రసిద్ది. ట్యూన్లనే కాదు... బ్యాగ్రౌండ్ స్కోర్లను కూడా ఎక్కడెక్కడి నుంచో ఎత్తేసే సమర్థుడు. ఈ విషయం ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. కాగా ఇప్పుడు ఆయన బన్నీ హీరోగా బోయపాటిశ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బేనర్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం 'సరైనోడు'కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ను చూసిన వాళ్లంతా ఆహా...ఓహో అంటున్నారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడని అంటున్నారు. అయితే ఈ టీజర్‌కు అందించిన ఆర్.ఆర్ ఎక్కడి నుండి లేపేశాడో ఇప్పుడు తెలిసిపోయింది. హాలీవుడ్ చిత్రం 'ట్రాన్స్‌ఫార్మర్3' ట్రైలర్‌కి కొట్టిన మ్యూజిక్కును తమన్ ఉన్నది ఉన్నట్లుగా 'సరైనోడు' టీజర్ కోసం ఎత్తేశాడు. టీజర్ కోసం కూడా కష్టపడటం ఎందుకులే? అని అనుకున్నాడో ఏమో గానీ ఆయన ఏకంగా హాలీవుడ్ సినిమా నుండి బ్యాగ్రౌండ్‌ను ఎత్తేశాడు. మరి ఈ చిత్రం పాటల ట్యూన్స్‌ను తమన్ ఎక్కడి నుండి లేపేశాడో? ఈ చిత్రం ఆడియో విడుదలైతే కానీ తెలియదు.