మన హీరోలకు వారి ఫ్యాన్స్‌కు ఉన్న అతి ఏమిటంటే... ఒకటి అరా సినిమాలకే కాదు... మొదటి సినిమా కూడా రిలీజ్ కాకముందే వారి పేరు ముందు బిరుదులు తగిలించేస్తూ ఉంటారు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ నుండి వరుణ్‌తేజ్ వరకు, నాగార్జున నుండి అఖిల్ వరకు ఇదే వరస. తాజాగా సునీల్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే అతనేమీ వారసుడు కాకపోవడంతో ఈ బిరుదు కాస్త ఆలస్యమైందని చెప్పవచ్చు. సునీల్ నటించిన తాజా చిత్రం 'కృష్ణాష్టమి' చిత్రం టైటిల్ కార్డ్స్‌లో సునీల్ పేరు ముందు గోల్డెన్‌స్టార్ అనే బిరుదును వేశారు. సునీల్ మాత్రం వద్దంటున్నా...ఆయన మాట వినకుండా దిల్‌రాజు, వాసువర్మలు చేసిన పని ఇది అని టాక్. కాగా ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో సినీ విమర్శకులు సునీల్ పేరు ముందు 'గోల్డెన్‌స్టార్' అని వేయకుండా 'రోల్ గోల్డ్‌స్టార్' అని వేసి ఉంటే కరెక్టుగా యాప్ట్ అయ్యేదని అంటున్నారు. మరి రాబోయే చిత్రాలలో కూడా సునీల్ ఇదే బిరుదును తన పేరు ముందు ఉంచుకుంటాడా? ఇప్పటికే పరువు పోగొట్టుకున్న ఆయన ఆ బిరుదును తీసి గట్టు మీద పెడతాడా? అనేది వేచిచూడాల్సిన అంశం.