రామ్ చరణ్ పెళ్లి తరువాత మళ్ళీ మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిరంజీవి గారి రెండో కూతరు శ్రీజ వివాహం అంతటా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన వారితోనే ఈ వియ్యం అందుకోవడం అందరినీ మరింత ఆనందానికి గురి చేస్తోంది. అందుకేనేమో నాన్న చిరంజీవి గారయితే నూట యాభయ్యో సినిమా ముహూర్తాన్నే వాయిదా వేసేసారు. అన్నయ్య రామ్ చరణ్ కూడా ధ్రువ షూటింగ్ మొదలెట్టినా ఖచ్చితంగా పెళ్ళికి రెండు వారాల ముందే ప్యాకప్ చెప్పేసి ఇంట్లో పెళ్లి పనులు చూసుకుంటానని చెల్లికి మాటిచ్చాడు. అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ సైతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతున్నా, పెళ్లి ముహూర్తానికల్లా ఫారెన్ షెడ్యూల్ పూర్తయి తాను హైదరాబాద్ నగరంలోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇక బాబాయ్ నాగ బాబు, అన్నయ్య వరుణ్ తేజ్, మరో చెల్లి నిహారికతో పాటుగా అల్లు ఫ్యామిలీ అండ్ మిగిలిన మెగా కాంపౌండ్ తారాగణం మొత్తం తమ తమ పనులను మూలకేసి వివాహ మహోత్సవంలో పాలుపంచుకోనున్నారు. ఇలా మెగా హీరోలు అందరినీ ఒకే వేదిక మీద చూడడం అభిమానులకు కూడా పండగలాంటిదే కదా!