దిల్‌రాజు ఇటీవల విడుదలైన 'కృష్ణాష్టమి' చిత్రం విషయంలో మీడియాపై, సినిమా రివ్యూలు, రేటింగ్స్‌పై ఒంటికాలితో లేచి తన సినిమాకు తనే రేటింగ్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా పరిస్థితిని చూస్తే రెండో వారం కూడా పడటం కూడా కష్టమే అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. ఈ చిత్రానికి అందరూ ఇచ్చిన రేటింగ్, రివ్యూలు చూస్తే మీడియాను ఆయన అనవసరంగా కెలికాడనే విషయం ఇప్పటికైనా ఆయనకు అర్థమైవుండాలి. ఈమధ్యకాలంలో వచ్చిన అతిపెద్ద కిచిడీ కథ ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో రకరకాల సినిమాలు కనపడుతుంటాయి. 'సంతోషం' (అజయ్ ఫ్లాష్‌బ్యాక్), '1' (నేనొక్కడినే) (హీరోయిన్‌ను పడేసే ఎత్తుగడ), హీరోయిన్ చెప్పే బెలూన్ ఫిలాసఫీ ( 'బాద్‌షా'లో కాజల్ క్యారెక్టరైజేషన్), కీలకమైన మలుపు (బావగారూ బాగున్నారా..!), ఇంటర్వెల్ (మర్యాద రామన్న), సెకండాఫ్‌లో విలన్స్‌ని మార్చటం (రెడీ), ఇలా అడుగడుగునా ఎన్నో సినిమాలు పంటి కింద రాయిలా వస్తూ, జ్ఞాపకశక్తికి పరీక్షలా తగులుతుంటాయి. అలా జరగడం చూసి సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి రివ్యూలు ఇచ్చిన రేటింగ్స్ కంటే ఇంకా తక్కువ రేటింగ్‌ను ఇస్తున్నారనే విషయం దిల్‌రాజుకు ఇప్పటికే అర్థం అయివుంటుంది.