నానీ పేరెత్తితే ముందుగా అందరం మాట్లాడుకునేది భలే భలే మగాడివోయ్ గురించి. 30 కోట్లు వసూల్ చేసిన ఈ చిత్రం తరువాత నాని నుండి వచ్చిన కొత్త మూవీ కృష్ణగాడి వీరప్రేమగాధ. హను రాఘవపుడి దర్శకత్వంలో పోయిన వారం రిలీజయిన ఈ సినిమా మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ ఇరగేస్తాయనుకున్న ఈ మూవీ మొదటి వారాంతానికి అనుకున్న సంఖ్యా కన్నా కాస్తంత తక్కువ షేర్ రాబట్టినా అమెరికాలో మాత్రం మరోసారి నానీ హవా కొనసాగింది. 600K వరకు రెవెన్యు జనరేట్ చేసిన క్రిష్ణగాడు ఇంకా నెమ్మదిగా, నింపాదిగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఓ ఇరగబడి థియేటర్స్ దగ్గరికి జనాలు రాకపోయినా, ఈ ఫ్లో కంటిన్యూ అయితే సుమారుగా 800K వరకు రాబట్టవచ్చు అన్నది ట్రేడ్ ట్రెండ్ అంచనా. భలే భలేతో పోలిస్తే ఇది తక్కువే అయినా నానీకి మాత్రం గొప్ప నంబరే. విచిత్రంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో కూడా వసూళ్లు పూర్తిగా డల్ కానప్పటికీ మెచ్చుకోదగ్గ షేర్ రికార్డు అవుతూనే ఉంది. మొదటి నాలుగు, అయిదు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళిపోయినా బయ్యర్లు, ఇప్పటికైతే హ్యాపీస్ అంటున్నారు.