'బాహుబలి' చిత్రం కోసం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన 'శ్రీమంతుడు' చిత్రాన్ని దాదాపు నెలరోజులు పోస్ట్‌పోన్ చేశాడు. అది సత్ఫలితాలనే ఇచ్చింది. రెండు సినిమాలు అద్బుతమైన కలెక్షన్లు కొల్లగొట్టాయి. తాజాగా మహేష్ తన 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి కూడా అదే రూట్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ ఏప్రిల్8న 'సర్దార్', ఏప్రిల్ 22న 'అ...ఆ'లు రిలీజ్ కానుండటంతో మహేష్ 29న రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనవసరంగా 'సర్దార్, ఆ..ఆ, సరైనోడు' చిత్రాలు మూడు ఏప్రిల్‌లోనూ రిలీజ్‌కు సిద్దం అవుతుండటంతో పోటీపడటం వల్ల తన సినిమాకు వచ్చే ఇబ్బందులను గ్రహించిన మహేష్ ఏప్రిల్ నెల నుండి మే నెలకు షిఫ్ట్ అయ్యాడు. ఎవరో ఏదో అనుకుంటారని, ఇదో పరువు సమస్యగా భావించకుండా మహేష్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. కాగా 'సీతమ్మ వాకిట్లో..సిరిమల్లె చెట్టు' తరహాలో ఈ చిత్రం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతూ, ఏకకాలంలోనే రిలీజ్‌కు సిద్దం అవుతోంది. సో.. మే నెలలో కూడా తమిళ పరిశ్రమలో కూడా ఎలాంటి పోటీ లేకుండా సోలోగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్ అతి త్వరలో అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అకాశం ఉంది.