నానీ కెరీర్ అండ్ స్టార్ డం గూర్చి చెప్పాలంటే ఈగ పక్కనెడితే, భలే భలే మగాడివోయ్ ముందు అటు తరువాత అని చెప్పాలేమో. ఎందుకంటే ఈగ మొత్తంగా రాజమౌళి బ్రాండ్ మీదే సేల్ అయితే భలే భలే మాత్రం 100 పర్సెంట్ నాని ఫ్యాక్టర్ మీదే ఆడిందని ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఓవర్సీస్ అంతటా నానీకి ఓ స్టార్ హీరోకు ఉండే ఫాలోయింగ్ ఈ ఒక్క మూవీతో వచ్చేసింది. అప్పటి నుండి, నానీ నుండి సినిమా వస్తోందంటే మినిమమ్ గ్యారంటీ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు అక్కడి జనాలు. న్యాచురల్ స్టార్ అంటే ఫ్యామిలీ ఆడియెన్సుకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తోంది. ఆ క్రేజ్ బేస్ చేసుకొని మొన్న రిలీజయిన కృష్ణగాడి వీరప్రేమగాధకు కూడా మొదటి మూడు రోజుల్లోనే అమెరికాలో వసూళ్లు హాఫ్ మిలియన్ వరకు చేరుకున్నాయంటే కొందరు స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఒక్క కృష్ణాష్టమి మినహా రానున్న రెండు వారాల్లో అబ్బో ఇది చూసేయాలి అన్న తపన పుట్టించే సినిమాలేవీ వరసలో లేవు. ఇప్పటికైతే హాఫ్ మిలియన్ గీత దాటేసాడు, మరి మిగలిన ఇంకో హాఫ్ కూడా దాటేయగలవా నానీ?