సినిమాలను ఎక్కువ రేటు పెట్టి కొనడం ట్రేడ్‌సర్కిల్స్‌లో బెట్టింగ్ లాంటిదే అంటూవుంటారు. ఇప్పుడు దిల్‌రాజు 'సోగ్గాడే..'తో హిట్ కొట్టిన నాగార్జున 'ఊపిరి', మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం' సినిమాల మీద కన్నేశాడు. ఈ రెండు చిత్రాలు నైజాం రైట్స్‌ను భారీ ధరలకు దిల్‌రాజు తీసుకున్నట్లు సమాచారం. 'సోగ్గాడే చిన్నినాయనా' సూపర్‌హిట్ అవ్వడంతో నాగ్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఈ రెండు సినిమాలు పివిపి బేనర్‌వే కావడం విశేషం. దీన్నిబట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే.. సమ్మర్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా పూర్తిస్థాయి బిజీగా ఉండేది దిల్‌రాజు అని. దిల్‌రాజు ఫైనల్ చేసి చిత్రం రైట్స్ తీసుకున్నాడంటే ఎంత రేటైనా ఇచ్చి అయినా ఆ సినిమాలను తీసుకోవడానికి మిగతా డిస్ట్రిబ్యూటర్లు కూడా క్యూ కడుతుంటారనేది తెలిసిన విషయమే. దిల్‌రాజు ప్రొడక్షన్ మీద కన్నా మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా పెద్ద పెద్ద మొత్తాలు వెచ్చించాల్సి రావడంతో అవి నిర్మాణంలాగే మారిపోతున్నాయి. మరి ఈ రెండు చిత్రాలు ఏ రేంజ్‌లో లాభాలు దిల్‌రాజుకు తీసుకువస్తాయో వేచిచూడాల్సివుంది....!