Advertisement
Google Ads BL

ఆ హీరోను నయన ఇబ్బందిపెడుతోందట..!


విక్టరీ వెంకటేష్‌ హీరోగా, నయనతార హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాబు బంగారం' చిత్రం షూటింగ్‌ చాలా స్పీడ్‌గా, సైలెంట్‌గా సాగిపోతోంది. ఈ చిత్రాన్ని వేగంగా మార్చి కల్లా పూర్తి చేసి సమ్మర్‌లోనే మంచి రిలీజ్‌ డేట్‌ చూసుకొని విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. కానీ ఈ చిత్రానికి నయనతార రూపంలో అనుకోని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ ముందు అనుకున్న ప్రకారం సాగడం లేదు. నిజానికి నయనతార ఫిబ్రవరిలోనే ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ కావాల్సివుండగా, ఇప్పటివరకు ఆమె షూటింగ్‌లో జాయిన్‌ కాలేదు. ముందుగా కమిట్‌ అయిన తమిళ చిత్రాలలో ఆమె బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని ఆమె ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, నయనతారకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ మొత్తం అలా పెండింగ్‌లోనూ ఉండిపోయిందని యూనిట్‌ సభ్యులు వాపోతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs