ఒకానొక సమయంలో 90 దశకంలో సన్నీ డియోల్ అన్న పేరు యాక్షన్ సినిమాలకు బాలివుడ్ అంతటా మార్మోగిపోయింది. తండ్రి ధర్మేంద్ర చరిష్మాను సన్నీ డియోల్ కాపాడుతూ వచ్చాడు. అలాంటి టైంలో సన్నీ నుండి వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రమే ఘాయల్. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా శత్రువుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ అన్నయ్య పగని తమ్ముడు ఏ విధంగా తీర్చుకున్నాడు అన్న కథను అమోఘంగా తెర మీద ఆవిష్కరించారు. అలాంటి కథకు పదహారేళ్ళ తరువాత సీక్వెల్ అంటూ సన్నీ డియోల్ మళ్ళీ హీరోగా పోయిన వారం వచ్చిన ఘాయల్ వన్స్ అగైన్ అన్న చిత్రం ఈసారి కూడా బాక్సాఫీస్ తుప్పు రేపింది. విడుదలైన మూడు రోజుల్లో సుమారుగా పాతిక కోట్లు కలెక్ట్ చేసి సన్నీలో సత్తా తగ్గలేదని రుజువు చేసింది. విశేషం ఏమిటంటే ఘాయల్ చిత్రంలో కథ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుండే ఈ సీక్వెల్ మొదవటం. మరీ ముఖ్యంగా సన్నీ డియోల్ దర్శకత్వం వహించగా, ధర్మేంద్ర ఈ సీక్వెల్ సినిమాని నిర్మించారు. ఘాయల్ అన్న బ్రాండ్ వచ్చి పదహారేళ్ళు అయినా క్రేజ్ చెక్కుచెదరలేదు.