తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష ఎన్నిక కు నిర్మాత సురేష్ బాబు అనర్హుడిగా కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ ఎన్నిక నిమిత్తం సమర్పించాల్సిన కొన్ని పత్రాలు సురేష్ బాబు సమర్పించక పోవడం తో..సివిల్ కోర్ట్ ఈ తీర్పు ని ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించిన ఏ శాఖకు పోటిచేయడానికి సురేష్ బాబు అర్హుడు కాదని సిట్టింగ్ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తాజా సమాచారం.