ఈ సంక్రాంతి సీజన్‌లో మొత్తం నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఇవ్వన్నీ మంచి కలెక్షన్లు సాధించి విజయాలను సొంతం చేసుకున్నాయి. కాగా ఈ నాలుగు చిత్రాల శాటిలైట్ హక్కులను ఏకంగా జెమినీ చానెల్ సొంతం చేసుకుంది. అందుకుగానే ఈ చానెల్ 20.5కోట్లు ఈ చిత్రాల రైట్స్ కోసం కేటాయించింది. 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి 7.5కోట్లు, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలకు 6.5కోట్లు చొప్పున, ఎక్స్‌ప్రెస్‌రాజాను మూడు కోట్లు చెల్లించిన జెమినీ ఈ నాలుగు చిత్రాల రైట్స్‌ను ఏకంగా తన ఖాతాలో వేసుకొంది. మరి ఈ నాలుగు చిత్రాలు ఎప్పుడు ప్రసారం అయినా తమ టీఆర్పీ రేటింగ్స్ బాగా వస్తాయని, అంతేగాక ఈ నాలుగు చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బుల్లితెరపై ఖచ్చితంగా ఆకట్టుకొని అద్భుతాలు సృష్టించి, ఎన్నిసార్లు వేసినా మంచి రెస్పాన్స్‌ను చేజిక్కించుకోవడం ఖాయమని జెమినీ చానెల్ భావిస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతి సీజన్ చిత్రాల విషయంలో అన్ని సినిమాలను ఒకే చానెల్ చేజిక్కించుకోవడం జెమీనీ చానెల్ చూపిస్తున్న దూకుడుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.