పవన్‌కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' సినిమా విషయమై ఓ వార్త ఇప్పుడు ట్రేడ్‌సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్8న విడుదల చేయడం ఖాయం కావడంతో బిజినెస్ కూడా ఊపందుకొంది. డిస్ట్రిబ్యూటర్ల వద్ద నుండి పెద్దపెద్ద అమౌంట్స్ ఆఫర్స్ వస్తున్నాయి. తమకే రైట్స్ ఇవ్వాలని కొందరు పవన్‌ని డైరెక్ట్‌గా కలుస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్‌కు చేసే అగ్రిమెంట్‌లో 'నో రిఫండ్' అనే క్లాజ్ పెట్టారని తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఓ సినిమా సరిగ్గా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్లు నానా యాగీ చేస్తున్నారు. నిర్మాతలనే కాదు.. హీరోలను సైతం అపత్రిష్టపాలు చేస్తున్నారు. లాభాల వస్తే హాయిగా ఎంజాయ్ చేసే వారు నష్టాలు వస్తే మాత్రం బజారునపడుతూ అందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అందుకే 'సర్దార్' విషయంలో ఈ కొత్త క్లాజ్‌ను చేర్చాలని, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చినా సరే పదిపైసలు కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఈ క్లాజ్‌లో పొందుపరిచారు. కానీ పవన్ వ్యతిరేకులు మాత్రం ఈ చిత్రంపై యూనిట్‌కు నమ్మకం లేకపోవడం వల్లే ఇలాంటి క్లాజ్ పెట్టారని దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో పవన్‌ది ఏమీ లేదని, కేవలం ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్ పొందిన ఈరోస్ సంస్థే తమ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుందని యూనిట్ వర్గాలు వివరణ ఇస్తున్నాయి.