సరైన సినిమా పవన్ కళ్యాణ్ గారికి పడాలి గానీ ఎంత ఉన్నతమైన గొప్ప రికార్డులు అయినా ఉఫ్ అంటూ కొట్టుకు పోతాయన్న విషయం గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఇంతకు మునుపే రుజువు చేసాయి. రావడం కొంత లేటయినా రావడం మాత్రం పక్కా అని తను చెప్పిన డయలాగ్ లాగానే రాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో మరోసారి రికార్డుల మోత మోగబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్, సీడెడ్ ఏరియాలలో అత్యధిక రేట్లకు అమ్ముడయిన సర్దార్ పంపిణీ హక్కులు ఈసారి నైజాం దుమ్ము దులిపాయి. పవన్ కళ్యాణ్ కంచుకోటగా మారిన తెలంగాణా రీజన్ సర్దార్ హక్కులను ఇంద్ర ఫిలిమ్స్ అధినేత దిలీప్ టాండన్ చేజిక్కించుకున్నారు. ధర కూడా అట్లా ఇట్లా కాదు, ఎప్పుడూ వినబడనటువంటిది. అవును, 20 కోట్లకు సర్దార్ గబ్బర్ సింగ్ నైజాం హక్కులను ఇంద్ర ఫిలిమ్స్ వారు పోటీపడి మరి గెలుచుకున్నారు. ఏప్రిల్ 8న రాబోతున్న ఈ పవర్ స్టార్ మూవీ, రిలీజుకి ముందే ఇంతలా వణికిస్తుంటే రేపు ధియేటర్లలో దిగబడ్డాక ఊరికే ఉంటాడా. ఆల్ రికార్డులు ఒకేసారి స్వీప్!