Advertisement
Google Ads BL

కోలీవుడ్‌లో మరోసారి రికార్డుల వేట..!


అభిమానులందు... తమిళ వీరాభిమానులు వేరయ్యా అని చెప్పవచ్చు. వారు ఏదైనా హీరోని అభిమానించడం మొదలు పెడితే ప్రాణాల కన్నా అధికంగా ఆరాధిస్తారు. దీన్ని అభిమానం అనడం కంటే పిచ్చి అభిమానం అని పిలవడం సమంజసమేమో అనిపిపిస్తుంది. ఇక తమిళంలో రజనీకాంత్‌, అజిత్‌, విజయ్‌ వంటి స్టార్లకు అభిమానులు కోట్లలో ఉంటారు. కాగా వీరిప్పుడు మరోసారి తమ రికార్డుల వేటను ప్రస్తావిస్తూ ఒకరిపై ఒకరు యుద్దానికి రెడీ అవుతున్నారు. తాజాగా విజయ్‌ హీరోగా 'రాజురాణి' ఫేమ్‌ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేరీ'. ఇందులో విజయ్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్‌ విడుదలైన తొలి ఆరు గంటలలోనే లక్ష వ్యూస్‌ను సాధించింది. ఈ ఘనతను సాధించిన తొలి ఇండియన్‌ చిత్రంగా రికార్డులను తిరగరాసింది. ఇప్పటివరకు ఉన్న రజనీ చిత్రాల టీజర్లను, అజిత్‌ నటించిన 'వేదలమ్‌' టీజర్‌ రికార్డులను, 'ఐ' చిత్రం నెలకొల్పిన రికార్డులను విజయ్‌ తిరగరాస్తున్నాడు. దాంతో వీరి అభిమానుల మధ్య వేడి వేడి చర్చ జరుగుతోంది. కాగా ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులను సృష్టిస్తుందా?అనేది వేచిచూడాల్సివుంది. 'పులి' ఫలితంతో నిరాశపడిన విజయ్‌ అభిమానులకు 'తేరి' కొత్త టానిక్‌లా పనిచేస్తోందని కోలీవుడ్‌ మీడియా అంటోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs