ఇండస్ట్రీలో ఎన్ని లెక్కలున్నా ప్రధానంగా హిట్ ఫ్లాప్ అనేవే ఎవరి కెరీర్‌ను అయినా డిసైడ్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పెద్ద హీరోలు ఎవరూ సోసోగా ఆడిన దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపించడం లేదు. రామ్‌చరణ్ కూడా 'బ్రూస్‌లీ' డిజాస్టర్ తర్వాత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే సంపత్‌నందికి రీసెంట్‌గా నో చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రచ్చ' హిట్. దాంతో ఒక్కసారిగా ఓవర్‌నైట్‌లో సంపత్‌నంది స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. సంపత్‌కి తదుపరి పవన్‌కళ్యాణ్ నుంచి ఆహ్వానం వచ్చింది. పవన్ తన 'గబ్బర్‌సింగ్2' చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు. అయితే స్క్రిప్ట్ సమయంలోనే పొత్తు కుదరక.. ప్రారంభమైన ప్రాజెక్ట్‌ను ఆపేశాడు. దాంతో ఏదో విధంగా ఆ విషయం నుండి బయటపడాలని సంపత్ 'బెంగాల్‌టైగర్' తీశాడు. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించలేక చతికిలపడింది. దాంతో అందరూ పవన్‌దే బెస్ట్ డెసిషన్ అన్నారు. ఇప్పుడు 'బెంగాల్‌టైగర్' ప్రభావమే సంపత్ నంది తదుపరి చిత్రానికి అడ్డుపడుతోంది. దాంతో సంపత్ నంది ఎప్పటినుంచో చెబుతున్న 'చోటామేస్త్రీ' కథను బయటకు తీసి రీసెంట్‌గా చరణ్‌కు వినిపించాడట. అయితే ఈ కథ కూడా 'రచ్చ' ఫార్మెట్‌లోనే ఉండటంతో చరణ్‌కి ఈ స్టోరీ నచ్చలేదని సమాచారం. దాంతో తను ఇలాంటి కథతో సినిమా చేయలేనని, అయినా ఇప్పుడు తను పూర్తిగా బిజీగా ఉన్నానని సంపత్‌కు తేల్చిచెప్పడంతో సంపత్‌నంది తీవ్ర నిరాశకు లోనైనట్లు సమాచారం.