Advertisement
Google Ads BL

బావ కోసం మహేష్‌..!


మహేష్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చింది. ఆ వెంటనే 'ఆగడు' వంటి డిజాస్టర్‌ ఇచ్చిన శ్రీనువైట్లకు ఆ తర్వాత 'బ్రూస్‌లీ' వంటి మరో పెద్ద డిజాస్టర్‌ వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయనకు అవకాశాలు ఇచ్చే హీరోలే కరువయ్యారు. కానీ మహేష్‌ మాత్రం ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే ఓ ట్విస్ట్‌. ఈ సినిమా తనతో కాదట. మహేష్‌ బావ అయిన సుధీర్‌బాబుతో అని తెలుస్తోంది. మహేష్‌కు కథ చెప్దామని వెళితే తన బావను నిలబెట్టడానికి ఓ కమర్షియల్‌ హిట్‌ కథతో సినిమా చేయమని మహేష్‌ అడిగాడని టాక్‌. మహేష్‌ వంటి స్టార్‌ హీరో అడిగినప్పుడు కాదనకూడదని శ్రీనువైట్ల సైతం ఈ ప్రాజెక్ట్‌ ను ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో సుధీర్‌బాబుకు లిఫ్ట్‌ ఇవ్వాలని మహేష్‌ ఫిక్స్‌ అయ్యాడు. అందుకే ఈ సినిమాని తానే ప్రొడ్యూస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs