ఇటీవల రాహుల్‌గాంధీ అనంతపూర్ టూర్‌కు వచ్చినప్పుడు చిరంజీవి హాజరుకాలేదు. అయితే ఆయన కాంగ్రెస్ నుండి వీడిపోవడానికే ప్లాన్ చేసుకొని ఇలా చేశాడంటూ రూమర్స్ వచ్చాయి. అయతే నిజం వేరే విధంగా ఉంది. చిరంజీవి రీసెంట్‌గా ముంబైలోని బ్రీచ్‌కాండీ హాస్పిటల్‌లో చేరాడని తెలుస్తోంది. చిరు తన భుజానికి సంబంధించిన సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్స్ సలహా మేరకు దాదాపు ఒక వారం విశ్రాంతి తరువాత చిరు ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్ తిరిగి వస్తాడని తెలుస్తోంది. చిరు సర్జరీ వార్త ఎంత నిజమో తెలియదు కానీ మెగాభిమానులు మాత్రం ఆందోళన పడుతున్నారు. చిరంజీవి రాహుల్‌గాంధీ అనంతపూర్ టూర్‌లో కనిపంచకపోవడమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా రాలేదు. ఇక పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన సాధా సీదా వ్యక్తికాదు. ఆయన ఎందరో అభిమానులను సంపాదించుకొని 'జనసేన' అనే పార్టీని స్థాపించిన నాయకుడు. ఈయన కూడా తుని సంఘటన విషయంలో కేరళలో జరుగుతున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ అదేపనిగా హైదరాబాద్ వచ్చి ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆ వెంటనే బయలుదేరి మరలా షూటింగ్‌లో జాయిన్ అయిపోయాడు. ఈయన కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఎంతో మందిని ఓటు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించాల్సిన వ్యక్తే అసలు ఓటును సద్వినియోగం చేసుకోకపోవడం విషయంలో ఈ మెగాబ్రదర్స్‌ను పలువురు ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు.