కొరటాల శివ దర్శకునిగా తన తొలి చిత్రం 'మిర్చి'తోనే భారీ హిట్టును కొట్టి అప్పటివరకు ప్రబాస్ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా ఆ చిత్రాన్ని నిలిపాడు. అప్పుడు మాత్రం కొరటాల శివతో చేయడానికి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు గ్రీన్‌సిగ్నల్స్ సైతం ఇచ్చారు. కానీ కొరటాలపై ఒక్క సినిమాతోనే జడ్జ్ చేయలేమని భావించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఆ ప్రాజెక్ట్‌లను పక్కనపెట్టారు. ఎన్టీఆర్ పూరీతో వెళితే, రామ్‌చరణ్ కృష్ణవంశీతో వెళ్లాడు. దాంతో దీన్ని ఓ అవమానంగా భావించిన కొరటాల శివ మహేష్ కోసం సబ్జెక్ట్ రెడీ చేసి, ఆయన నుండి గ్రీన్‌సిగ్నల్ రావడంతో 'శ్రీమంతుడు' చిత్రం చేశాడు. ఈ చిత్రం నాన్ 'బాహుబలి' రికార్డులన్నీ బద్దలుకొట్టింది. దాంతో 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉన్న ఎన్టీఆర్ కేవలం కొరటాల చేత తదుపరి చిత్రం చేస్తానని మాట తీసుకోవడం కోసం లండన్ నుండి హైదరాబాద్ వచ్చి కొరటాల దగ్గర ప్రామిస్ చేయించుకొని వెళ్లాడు. ఇక రామ్‌చరణ్ చిత్రం ముహూర్తం కూడా జరుపుకొని షూటింగ్ ఆగిపోయింది కూడా కేవలం కొరటాలపై నమ్మకం లేకనే అనే విషయం వాస్తవం. కాగా ఇప్పుడు కొరటాలశివ ఎన్టీఆర్‌తో చేస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత తనతోనే ప్రాజెక్ట్ చేయాలని కొరటాల వద్ద రామ్‌చరణ్ ప్రామిస్ తీసుకున్నాడట. మొత్తం మీద తనను వద్దన్నవారినే తన దగ్గరకు వచ్చేలా చేసిన కొరటాల శివను ఇప్పుడు అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దటీజ్ కొరటాల..!