అక్కినేని వంశ హీరోల్లో నాగార్జునది ప్రత్యేక స్థానం. కాగా ఈ గ్రీకువీరుడు ఈ వయసులో కూడా గ్లామర్‌పరంగానే కాదు... రికార్డుల పరంగా కూడా తన తనయులకు సవాల్ విసురుతున్నాడు. వాస్తవానికి అక్కినేని వంశ హీరో అయిన నాగ్‌కు నిన్నటివరకు సోలో హీరోగా కేవలం 20కోట్ల మార్కెట్ మాత్రమే ఉందేది. కానీ తను నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' తో ఆయన ఇప్పుడు 40కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. మరి ఈ ఫీట్‌ను ఈ వయసులో సాధిస్తానని నాగ్ సైతం ఊహించి ఉండకపోవచ్చు. ఆయనకే ఆశ్యర్యం కలిగే రీతిలో ఆయన ఈ ఫీట్‌ను సాధించిన తొలి అక్కినేని వంశ హీరోగా మారాడు. వాస్తవానికి ట్రేడ్‌వర్గాల విశ్లేషణ ప్రకారం నాగచైతన్యకు ఇది ఇప్పుడే సాధ్యం కాదని, అఖిల్‌కి మంచి సినిమా పడితే ఆయనకే ఈ రికార్డును సాధించే సత్తా ఉందని భావించారు. కానీ 'అఖిల్' చిత్రం డిజాస్టర్ కావడంతో ఆ ఆశలు నెరవేరలేదు. మరి నాగ్ నెలకొల్పిన ఈ 40కోట్లను క్రాస్ చేసి 50కోట్ల క్లబుల్లో స్థానం సాధించడం అఖిల్, చైతూలకు ఓ సవాలే అని ఒప్పుకోవాలి. హ్యాట్రాఫ్ టు నాగ్....!