ప్రస్తుతం బాలయ్య తన 100వ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించి ఉన్నాడు. ఆయనతో వందో చిత్రం విషయంలో ఇప్పుడు ముగ్గురు దర్శకుల మధ్యపోటీ ఉందని టాలీవుడ్ సమాచారం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా చేయనున్న 'ఆద్యిత999', అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రామారావు గారు', ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం లైన్‌లో ఉన్నాయి. అయితే వీటిల్లో తన 100వ చిత్రానికి ఏ సినిమాను బాలయ్య ఎంపిక చేస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. మొదట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ వైపు మొగ్గిన బాలయ్య అభిమానుల, సన్నిహితుల బలవంతం మేరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే తన 100వ చిత్రం చేయాలని, కాస్త ఆలస్యమైనా బోయపాటితో హ్యాట్రిక్ సినిమాపై 'గాడ్‌ఫాదర్' చిత్రాన్నే చేయాలని భావిస్తున్నాడట. మరి కొన్ని రోజులు గడిస్తే గానీ ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కాగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయబోయే సైన్స్‌ఫిక్షన్ మూవీ 'ఆదిత్య999' స్టోరీ విషయంలో ఈ చిత్ర కథ కాస్త లీక్ అయిందని అంటున్నారు. వాస్తవానికి మెగాహీరో అల్లుఅర్జున్ ఇటీవల 'రుద్రమదేవి' చిత్రంలో గోనగన్నారెడ్డిగా కీలకపాత్ర పోషించాడు. ఆ చిత్రానికి ఆ పాత్రే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా బాలయ్య విషయానికి వస్తే 'ఆదిత్య999' చిత్రం 'ఆదిత్య999' లాగానే టైమ్‌మెషీన్ ఆధారంగానే కొనసాగుతుందని సమాచారం. 'ఆదిత్య 369'లో హీరో టైమ్‌మెషీన్‌లో చిక్కుకుని శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్తాడు. ఇందులో శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య పోషించిన పాత్ర హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం సీక్వెల్‌లో కూడా హీరో బాలయ్య ఈ టైమ్‌మెషీన్‌లోకి ఎక్కి అనుకోకుండా కాకతీయుల కాలం వెళ్లిపోతాడట. అక్కడ గోనగన్నారెడ్డిగా బాలయ్య కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ విషయమై మెగాభిమానులు-నందమూరి అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. బన్నీని మించిన స్థాయిలో ఈ చిత్రంలో బాలయ్య 'గోనగన్నారెడ్డి'గా అదరగొడతాడని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే మెగాభిమానులు మాత్రం బన్నీ చేసినట్లుగా ఆ పాత్రకు ఎవ్వరూ న్యాయం చేయలేరని భావిస్తున్నారు.