నటునిగా తన రెండు దశాబ్దాల గమనంలో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్... ఇలా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఇమేజ్ ఛట్రంలో ఇమడకుండా ప్రతి పాత్రను తనదైన శైలిలో నటించి ఆయన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. ఇటీవల కాలంలో ఆయన 'త్రీ ఇడియట్స్, తను వెడ్స్ మను పార్ట్2' చిత్రాలతో బాలీవుడ్‌లో విజయబావుట ఎగరవేశాడు. తాజాగా ఇటీవల విడుదలైన 'సాలా ఖద్దూస్' చిత్రంతో మరో హిట్టు కొట్టాడు. విమర్శకుల ప్రశంసలు పొందుతున్న ఈ చిత్రంలో మాధవన్ రాజకీయాలకు బలైపోయిన ఓ బాక్సింగ్ కోచ్‌గా నటించాడు. ఆయన నటనకు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రానికి తెలుగమ్మాయి సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహించింది. తెలుగులో ఆమె డైరెక్షన్‌లోనే ఇదే చిత్రం రీమేక్‌కు సిద్దం అవుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే అవకాశాలు వున్నాయి.