Advertisement
Google Ads BL

సైలెంట్‌గా పని కానిస్తున్న జక్కన్న..!


'బాహుబలి' మొదటి పార్ట్‌ షూటింగ్‌లో కనీసం అప్‌డేట్స్‌ అయినా తెలుస్తుండేవి.కానీ 'బాహుబలి2' విషయంలో మాత్రం దర్శకుడు రాజమౌళి గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తిచేస్తున్నాడు. ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ కూడా పూర్తయింది. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్‌తో ఈ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయింది. కాగా ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌ నుండి రామోజీఫిలింసిటీలో జరుగుతోంది. కాగా 'బాహుబలి' మొదటి పార్ట్‌ను 90శాతం షూటింగ్‌ను రామోజీఫిలింసిటీ, కేరళలో పూర్తి చేశాడు జక్కన్న. కేవలం మంచు తుఫాన్‌ సీన్‌కోసం బల్గేరియా వెళ్లాడు. తాజాగా రెండోపార్ట్‌లోని ఓ అద్భుతమైన సీన్స్‌ కోసం ఈ సారి యూఎస్‌కు వెళ్లనున్నారు రాజమౌళి అండ్‌ టీం. కాగా ఫస్ట్‌హాఫ్‌ను అద్భుతమైన ట్విస్ట్‌తో ముగించిన జక్కన్న సెకండ్‌ పార్ట్‌లో ఆ కీలక సన్నివేశాలను అందరిని మెప్పించేలా తీయడంతో నిమగ్నమై ఉన్నాడు. కాగా త్వరలో ఈ చిత్రం యూనిట్‌తో రానా కలవనున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs