మెగాపవర్‌స్టార్‌గా అందరూ పిలుచుకునే రామ్‌చరణ్ ఇప్పటివరకు కేవలం మాస్ అండ్ యాక్షన్ చిత్రాలతోనే ప్రేక్షకులను మెప్పించాడు. బొమ్మరిల్లు భాస్కర్‌తో చేసిన 'ఆరెంజ్' చిత్రంతో యూత్‌కి, క్లాస్ ఆడియన్స్‌కి దగ్గర కావాలని చూశాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఇలాంటి చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే ఓవర్‌సీస్‌లో సైతం తనకు పెద్దగా క్రేజ్ రాకపోవడానికి క్లాస్ మూవీస్ చేయకపోవడమే తప్పు అని భావించిన చరణ్ త్వరలో ఆ తరహా చిత్రాన్ని చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా క్లాస్ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను తన దర్శక ప్రతిభతో ఓ ఊపు ఉపుతోన్న సుకుమార్ అయితేనే తనకు క్లాస్ ఇమేజ్ రావడానికి సరైన చాయిస్ అని భావించిన చరణ్ త్వరలో సుక్కు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆశతో ఉన్నాడు. ఇప్పటివరకు తెలుగులో ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ఓ నిర్మాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ను సెట్ చేయడానికి పావులు కదుపుతున్నాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో వేచిచూడాల్సివుంది..!