Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ చిత్రంలో మరో మలయాళ విలన్‌..!


త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఎన్టీఆర్‌-కొరటాల శివల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్‌' చిత్రంలో ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, కేరళ యువ స్టార్‌ హీరో ఫహాద్‌ఫాజిల్‌, నిత్యామీనన్‌ వంటి మలయాళంలో గుర్తింపు ఉన్న నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో యువ విలన్‌ పాత్రకు కూడా మరో మలయాళం నటుడిని ఎంపికచేశారు. అతనే ఉన్నిముకుందన్‌. కాగా ఈ చిత్రంలో తాను విలన్‌గా నటిస్తున్నట్లు ఉన్నిముకుందన్‌ దృవీకరించాడు. ఎన్టీఆర్‌-మోహన్‌లాల్‌ వంటి స్టార్స్‌తో తాను కలిసి నటిస్తుండటం తన అదృష్టమని, ఈ చిత్రంలో నటించడాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకుంటున్నానని ఆయన ట్వీట్‌ చేశాడు. ఈ అవకాశం రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడంలేదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా ఈచిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభంకానుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs