రాజమౌళి ఓటమి ఎరుగని దిగ్దర్శకుడు అయినంత మాత్రాన, అతని స్కూలు నుండి వచ్చే విద్యార్థులు కూడా మరో రాజమౌళి అవుతారు అనుకోవడం సరికాదు. లచ్చిందేవికి ఓ లెక్కుంది అన్న సినిమాకు దర్శకత్వం వహించిన జగదీష్ తలశిల, ఖచ్చితంగా రాజమౌళి శిష్యరికం బ్రాండుని వీలైనంతగా వాడుకునే ప్రయత్నం చేసారు. కానీ మూవీ బాగుంటే, జనానికి ఏ కేరాఫ్ అడ్రస్ అవసరం లేదు ఎందుకంటే సినిమానే అన్నింటికీ, అందరికీ చిరునామాగా మారుతుంది. దురదృష్టవశాత్తు, లచ్చిందేవి లెక్క తప్పి తన సినిమాకే కటాక్షం చూపలేక పోయింది. లావణ్య త్రిపాటి, నవీన్ చంద్ర, జయప్రకాశ్ రెడ్డి ముఖ్య తారాగణంగా వచ్చిన లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం పోయిన వారం విడుదలయిన అన్నింటిలోకెల్లా వీకెస్ట్ అంటున్నారు జనాలు. మొదటి నుండి, ట్రైలర్ విడుదలైన తరువాతా, ఈ మూవీ పట్ల కొంత అనుకూల పవనాలు వీచినా చివరాఖరుకి బాక్సాఫీస్ దగ్గర మాత్రం బొక్కబోర్లా పడింది.