పవన్‌కళ్యాణ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఎప్పుడూ తన ఆయన నిర్మాతలపై గానీ, దర్శకులపైగానీ కంప్లైంట్ చేయలేదు. అలాంటిది 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల ముందు రోజు ఆ చిత్ర నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మీద 'మా'లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించి తనకు ఇవ్వాల్సిన 2కోట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చాడు. పవన్‌కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఇలా రెమ్యూనరేషన్ విషయంలో కంప్లైంట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా పవన్‌్ ఇలా చేసే వ్యక్తికాదు. కానీ పవన్ మంచితనాన్ని నిర్మాత ప్రసాద్ అలుసుగా తీసుకున్నాడు. పవన్ కబురు పెడితే కనీసం స్పందించకపోవడంలాంటివి చేశాడట. ఫోన్ చేసినా అవాయిడ్ చేయడం లాంటివి చేశాడని సమాచారం. అందుకే పవన్‌కు కోపం వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఆ నిర్మాతపై ఫిర్యాదు చేశాడు. అప్పటివరకు ఈ ఇద్దరికీ కనీసం ఫోన్‌లో కూడా దొరకకుండా తప్పించుకు తిరిగిన ప్రసాద్ ఈ కంప్టైట్‌తో ఖంగుతిన్నాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ తర్వాత మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ క్లియర్ చేస్తానని చెప్పడంతో 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రిలీజ్ అయింది. ఈ విషయంలో పవన్ గానీ గొడవ చేసి ఉంటే ఈ చిత్రం రిలీజ్‌పై కూడా ఆ ప్రభావం పడివుండేది. అందుకే నిర్మాత ప్రసాద్, హీరో ఎన్టీఆర్‌లు పవన్‌కు రుణపడి ఉన్నారని ఫిల్మ్‌నగర్‌లో చర్చ జరుగుతోంది. 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి కలెక్షన్లు బాగాన్నా లాభాలు ఆశించిన రేంజ్‌లో లేవు. ఇప్పటికైతే తన చేతికి వచ్చిన డబ్బుతో నిర్మాత ప్రసాద్ వెంటనే పవన్‌ను సంప్రదించి బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడానికి వచ్చాడని, ఇంత ఇబ్బంది పెట్టిన నిర్మాతను సైతం పవన్ ఏమీ అనకుండా నిర్మాత కోరిక మేరకు తనకు రావాల్సిన రెండు కోట్లలో 50లక్షలు డిస్కౌంట్ ఇచ్చి ఒకటిన్నరకోటి మాత్రమే స్వీకరించాడని సమాచారం. త్రివిక్రమ్ కూడా పవన్ రికమెండ్ చేయడంతో తనకు రావాల్సిన బ్యాలెన్స్‌లో కొంత మొత్తాన్ని వదులుకొని నిర్మాత ఇచ్చినంత తీసుకున్నాడని, ఇదంతా పవన్ మంచితనాన్నికి గుర్తుగా నిలుస్తాయని విశ్లేషకులు అంటున్నారు.