అఖిల్ చిత్ర ఘోర పరాజయం తరువాత అక్కినేని సిసింద్రీ అఖిల్ నిజంగా ఆలోచనలో పడ్డాడు. మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ డం కొట్టేయాలన్న ఆలోచన డాం అనడంతో రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేయనున్నాడు. ఏ జవాని హై దీవాని అన్న హిందీ చిత్రం తెలుగు రీమేక్ అన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టినా అదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో నైజాం పంపిణీదారులు అభిషేక్ పిక్చర్స్ వారు తీసుకున్న చొరవతో అఖిల్, సుకుమార్ చిత్రం ఒకటి పట్టాలెక్కే ముందస్తు సూచనలు కనపడుతున్నాయి. సుకుమార్ ఆఖరి చిత్రం నాన్నకు ప్రేమతో విజయం సాధించడం, ఆ విజయంలో నైజాం హక్కులను సొంతం చేసుకున్న అభిషేక్ నామా పాత్ర గణనీయంగా ఉండడంతో ఇప్పుడు వీరిద్దరూ ఓ జట్టుగా చేరబోతున్నారు. ఈ మధ్యలో సుకుమార్ ఒప్పుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఆరంగేట్ర చిత్రంతో పాటు దర్శకుడు అనే మరో ప్రాజెక్టు కూడా లైన్లో ఉన్నాయి. మరి వీటన్నింటినీ కాదని సుక్కు గనక అభిషేక్ నామాకు ఈ సినిమా సంతకం చేస్తే అఖిల్ నిజంగా అదృష్టవంతుడే. ఎందుకంటే అల్లు అర్జున్ సెకండ్ మూవీ ఆర్య కూడా సుకుమార్ తీసిందే. ఆ చిత్రంతో బన్నీ తలరాతే మారిపోయింది. ఈసారి అఖిల్ కూడా అంతే లక్కీ కావొచ్చు!