'భలే భలే మగాడివోయ్'తో సంచలనం సృష్టించిన మారుతి ప్రస్తుతం వెంకటేష్-నయనతార కాంబినేషన్‌లో 'బాబు బంగారం' (వర్కింగ్‌టైటిల్) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'దృశ్యం' తర్వాత మరోసారి సోలో హీరోగా వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రం రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందుతోంది. ఈ సినిమా చాలా సైలెంట్‌గా , స్పీడ్‌గా సాగిపోతోంది. అదే విధంగా ఈ చిత్రం బిజినెస్ సైతం చాలా ఊపుగా,స్పీడుగా సైలెంట్‌గా జరిగిపోతోందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఉత్తరాంద్ర బిజినెస్ జరిగిందంటున్నారు. దీనికి ఓ మంచి ఫ్యాన్సీ అమౌంట్‌ను ఇచ్చి భారతీ పిక్చర్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం.ఈ చిత్రానికి అన్నిచోట్లా భారీ అంచనాలే ఉన్నాయి. 'భలేభలే మగాడివోయ్'తో సంచలనం సృష్టించిన మారుతి ఈ సారి వెంకీతో కూడా తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడనే నమ్మకం అందరిలో నెలకొని ఉంది. మరి ఈ చిత్రం కూడా వెంకీ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి....!