Advertisement

రీమేక్ మీద కన్నేసిన వెంకటేష్!


వెంకటేష్ బాబుకి రీమేకులు చేయడం కొత్తేమీ కాదు. హిందీలో, మలయాళంలో, తమిళంలో హిట్టయిన చానా కథలను ఈయనగారు ఇక్కడ తెలుగులో చేసి మెప్పించిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి మాత్రం హిందీలో ఇంకా రిలీజవక ముందే మాధవన్ నటించిన సాలా ఖదూస్ మీద కర్చీఫ్ వేసేసారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం పట్ల సర్వత్రా పాజిటివ్ టాక్ వినబడుతోంది. ఎందుకో ఏమో గానీ, చిత్ర దర్శకుడు సుధా కొంగర ప్రసాద్ తన సాలా ఖదూస్ చిత్రాన్ని వెంకీకి ప్రీమియర్ షో వేసి మరీ చూపించారట. మైండ్ బ్లోయింగ్ అని పొగిడేస్తూ ఈ కథను యదావిదిగా తెలుగులో చేస్తానంటే తన కాల్షీట్స్ ఈ ఏడాదిలోనే ఇస్తానని వెంకటేష్ దర్శకుడికి మాట కూడా ఇచ్చేసారని టాక్. కథానుసారం మాధవన్ ఓ రిటైర్ అయిపోయిన బాక్సర్. మట్టిలో మాణిక్యాన్ని వెతికినట్టే ఓ చాంపియన్ స్టూడెంట్ కోసం మాధవన్ వెతకడం, అలా దొరికిన రితిక సింగుని సాన బెట్టి చాంపియనుగా తయారు చేసే క్రమంలో ట్రైనర్, స్టూడెంట్ పడే కష్టాలే ఈ సినిమా కథ. ఈ నెల 29న సాలా ఖదూస్ రిలీజ్ తర్వాత మన తెలుగు ఖదూస్ మీద మరింత క్లారిటీ రావొచ్చు.  

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement