త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ గార్లు అత్తారింటికి దారేది ముగింపు ఘట్టాల మీద ఎంత కుస్తీ పడ్డారో అటు తరువాత వాళ్ళు విన్నవించుకున్న కష్టాన్ని బట్టి అర్థమయింది. త్రివిక్రమ్ గారు సుమారుగా అయిదు వెర్షన్లు రాసిన తరువాత గానీ అంతటి నాణ్యత రాలేదని చెప్పారు. అందుకే అత్తారింటికి సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ ఈ ఒక్క రైల్వే స్టేషన్ సీన్లో చూపించిన నటనా పటిమకు తెలుగు ప్రజలు దాసోహం అయిపోయి ఇండస్ట్రీ హిట్టు పట్టాను చేతిలో పెట్టారు. మళ్ళీ అలాంటి కష్టమే సుకుమార్ గారు కూడా జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో క్లైమాక్స్ ఎపిసోడ్ మీద పడ్డట్టు తెలుస్తోంది. సుమారుగా అయిదు భిన్నమైన వర్షన్లు రాసిన తరువాత, టీం మొత్తంతో డిస్కస్ చేసి లాస్ట్ వర్షన్ ఓకే చేసారట. నిజానికి ఫస్ట్ వెర్షన్లో అందరూ గట్టిగా ఏడ్చేశారట. బాబోయ్ ఇంత ఎమోషన్ వద్దనుకుని రిఫైన్ చేస్తూ పోతే ఆఖరుకి ఇప్పుడునున్న దానితో అందరూ ఎకీభవించారట. తారక్ ఎంత గొప్ప నటుడో మనకు తెలియనిది కాదు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ అంటే మన తెలుగు జనాలకు సైతం ఇట్టే హత్తుకు పోతుంది. మరీ అలాగని హీరో అభిరామ్ పాత్ర స్వభావాన్ని దెబ్బ తినేలా కూడా ఏడిపించడం తప్పయిపోద్ది. ఇలా అన్ని లెక్కలు వేసుకున్నాకే సుకుమార్ గారు షూటింగ్ మొదలెట్టారు.