Advertisement
Google Ads BL

త్రివిక్రమ్‌తో విబేదాలు నిజమేనా?


త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా సమంత, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నదియ కీలకపాత్రను పోషిస్తున్న చిత్రం 'అ..ఆ'. కాగా ఈ చిత్రం టీమ్‌ నుండి ఒకరొకరు బయటకు వస్తున్నారు. ఆమద్య ఆర్ట్‌డైరెక్టర్‌ బయటకు రాగా తాజాగా సంగీత దర్శకుడు అనిరుద్‌ సైతం ఈ ప్రాజెక్ట్‌ నుండి బయటకు రావడం తెలిసిన సంగతే. వాస్తవానికి ఎలాగైనా సంక్రాంతి కల్లా ఈచిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తానని నిర్మాత రాధాకృష్ణకు మాట ఇచ్చాడట త్రివిక్రమ్‌. కానీ సంక్రాంతి నాటికి ఈ చిత్రం పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల చేయిస్తానని నిర్మాతను ఒప్పించాడు త్రివిక్రమ్‌. కానీ ఆ రోజున కూడా విడుదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో మార్చిలో గానీ రిలీజ్‌కు సిద్దం చేయలేనని త్రివిక్రమ్‌ చేతులు ఎత్తేశాడు. వాస్తవానికి ఈ చిత్రం ప్రారంబానికి ముందు ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్‌లో తీయాలని నిర్మాత రాధాకృష్ణ త్రివిక్రమ్‌కు స్పష్టం చేశాడని సమాచారం. కానీ ఇప్పటికే అనుకున్న బడ్జెట్‌ కంటే 50 శాతం ఎక్కువైందిట. సినిమా పూర్తయ్యేలోపు ఈ బడ్జెట్‌ ముందు అనుకున్న దానికంటే రెట్టింపు అయ్యే పరిస్థితి ఏర్పడడంతో రాదాకృష్ణకు త్రివిక్రమ్‌కు మద్య విభేదాలు వచ్చాయని సమాచారం. బడ్జెట్‌ తడసిమోపెడు అవుతుండటంతో నిర్మాత అష్టకష్టాలు పడుతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs