వయసు పెరుగుతున్నా హీరోగా రవితేజ తేజస్సు మాత్రం తగ్గడం లేదు. కిక్ 2 ఒక్కటి వదిలేస్తే బలుపు, పవర్, బెంగాల్ టైగర్ చిత్రాల విజయాలతో మాస్ రాజా మరోసారి ఫాంలోకి వచ్చాడని మనం అందరం ఆనందపద్దాం. కానీ రవితేజ మాత్రం ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహాన్ని ఎలా వాడుకోవాలా అని మథనపడుతున్నాడు. బెంగాల్ టైగర్ అనంతరం మొదలవాల్సిన ఎవడో ఒక్కడు చిత్రం, కారణం ఏదైనా ప్రస్తుతానికి అటక ఎక్కేసింది. ఇక బెంగాల్ టైగర్ ఊపును కంటిన్యూ చేసే ప్రాజెక్టు మరేదీ రవితేజ ఇంకా సైన్ చేయలేదు. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తీసుకోవడం మంచిదే అయినా మాస్ రాజా మాత్రం ఇటువంటి పద్ధతి ఎప్పుడూ ఫాలో అవలేదు. ముఖ్యంగా కెరీర్ పీకులో ఉన్నప్పుడయితే ఈయన గారు ఏడాదిలో ఒక్క నెల కూడా ఖాళీగా ఉన్న దాఖలాలు లేవు. అంతటి వేగాన్ని ఇష్టపడే రవితేజ ఇలా ఒక్కసారిగా మందగించడం అభిమానులకు నచ్చటం లేదు. కానీ అసలు విషయం సారు గారికి అర్థమయింది. అవే రొటీన్ పాత చింతకాయ పచ్చడి కథలతో వస్తే ప్రేక్షకులు చిరాకు పాడడం ఖాయమని, అందుకే తనను బాగా ఇంప్రెస్ చేసే కొత్త పాయింట్ దొరికే వరకు వెయిట్ చేసేందుకు సిద్ధమని తోటి దర్శకులతో చెబుతున్నారట. మరి రవి గారి నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందో.