Advertisement
Google Ads BL

రెజీనా కొత్త జోనర్ టచ్ చేస్తోంది..!


నిన్నటివరకు అన్నిచిత్రాల్లో గ్లామర్‌షోతో, లిప్‌కిస్‌లతో అదరగొట్టిన హీరోయిన్‌ రెజీనా త్వరలో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్దమైంది. ఆమె ఓ హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ చిత్రం చేయనుంది. విభిన్న చిత్రాల దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్‌ అలియాస్‌ శ్రీరాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్రాన్ని గౌతమ్‌మీనన్‌ నిర్మిస్తుండగా, ఎస్‌.జె.సూర్య హీరోగా నటిస్తున్నాడు. అంటే ఈ చిత్రం ముగ్గురు దర్శకుల కాంబినేషన్‌లో రూపొందుతుందన్న మాట. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రెజీనాను ఎంచుకున్నారు. ఆద్యంతం భయపెట్టే ఈ సినిమాలో రెజీనా క్యారెక్టర్‌ చాలా కీలకమని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఏకకాలంలో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు. మరి ఈ చిత్రం ద్వారా తనలోని నటిని కూడా చూపించి ఈ పాత్రను న్యాయం చేయాలని రెజీనా భావిస్తోంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs